గార్డెన్ సిటీలోను ప్రత్యక్షం: తెరపైకెక్కిన మోడీ (పిక్చర్స్)

బెంగళూరు: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ నవ భారత యువ భేరీ ప్రసంగాన్ని బెంగళూరులో ప్రత్యక్ష ప్రసారం(లైవ్ టెలికాస్ట్) చేశారు. మోడీ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే.

ఈ ప్రసంగాన్ని బెంగళూరు యువత వినేందుకు అనుగుణంగా బగుల్ రాక్ పార్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాదాపు మూడు వందలకు పైగా మంది ఈ ప్రసారాన్ని తిలకించారు. ఇందులో యువతనే కాకుండా అన్ని వయసుల వారు ఉన్నారు. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు మోడీ ప్రసంగం పూర్తయ్యే వరకు వారు చూశారు.

దీనిని 'నమో' బ్రిగేడ్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నమో బ్రిగేడ్ సభ్యులు నంద గిరీష్ మాట్లాడుతూ... తాము ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్లము కాదని, కేవలం మోడీ సుపరిపాలనను హైలెట్ చేయడమే తమ ఉద్దేశ్యమన్నారు. దేశానికి ఎలాంటి నాయకుడు అవసరమో తాము ప్రజలకు చెప్పదల్చుకున్నామన్నారు. కాగా గతంలో గుజరాత్ ఎన్నికల సమయంలో మోడీ అహ్మదాబాద్ నుండి మాట్లాడితే నాలుగు నగరాల్లో దానిని త్రిడి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. నిన్న ఎల్బీ స్టేడియానికి అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో బయట తెరలు(స్ర్కీన్స్) ఏర్పాటు చేశారు.

 నమో బ్రిగేడ్

నమో బ్రిగేడ్

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభ కోసం 'నమో బ్రిగేడ్' ఆధ్వర్యంలో కర్నాటక రాజధాని బెంగళూరులోని బగుల్ రాక్ పార్కులో ఏర్పాటు చేసిన తెర.

మోడీ ప్రసంగం ఆసక్తిగా వింటున్న యువత

మోడీ ప్రసంగం ఆసక్తిగా వింటున్న యువత

నవ భారత యువ భేరీ ప్రాంగణం నుండి గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న యువత, పెద్దలు.

 గార్డెన్ సిటీలోను మోడీ!

గార్డెన్ సిటీలోను మోడీ!

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని గార్డెన్ సిటీలో ఆద్యంతం ఆసక్తిగా వింటున్న అభిమానులు.

మోడీ ప్రసంగం

మోడీ ప్రసంగం

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన నవ భారత యువ భేరీ సభ కోసం 'నమో బ్రిగేడ్' ఆధ్వర్యంలో కర్నాటక రాజధాని బెంగళూరులోని బగుల్ రాక్ పార్కులో ఏర్పాటు చేసిన తెర.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+