విజయమ్మ దీక్షకు మద్దతు: గంటా, బొత్సతో టి నేతలు

ఎకె ఆంటోని కమిటి విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం జిల్లాల్లో పర్యటించి ఉద్యమ తీవ్రతను గుర్తించాలన్నారు. ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలతో సీమాంధ్రుల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. సమైక్య ఉద్యమం ప్రజా ఉద్యమమే అన్నారు. దీనిని తప్పుపట్టడం సరికాదన్నారు.
ఆంటోనీ కమిటీకి ఏం చెప్పాలనే అంశంపై తాము శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అనంతరం నిర్ణయిస్తామన్నారు. తాను విజయమ్మ దీక్షకు మద్దతు తెలుపుతున్నానని, సమైక్యాంధ్ర కోసం ఎవరు దీక్ష చేసినా తాను మద్దదతిస్తానన్నారు.
డిగ్గీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: సోమిరెడ్డి
ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఆంటోనీ పెదవి విప్పడం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా ఆరోపించారు. సీమాంధ్రుల మనోభావాలను కాంగ్రెసు పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. విభజనపై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు.
పిసిసి చీఫ్‌తో తెలంగాణ నేతలు
పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications