ప్రేమే నేరమా: చున్నీ బిగించి కూతురిని చంపాడు

వివరాలు ఇలా ఉన్నాయి - సత్యనారాయణ కంప్రెషర్ ట్రాక్టర్ నిర్వహిస్తుంటాడు. ఆయన కూతురు మహేశ్వరి హన్మకొండలో ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కేసముద్రంకు చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది.
ఈ విషయం తం డ్రికి తెలియడంతో కూతురిని ఈ నెల 1న హాస్టల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అదే సమయంలో మహేశ్వరి తల్లి హైదరాబాద్‌లో ఉంటున్న మరో కూతురి వద్దకు వెళ్లింది. మహేశ్వరీ సెల్ ఫోన్లలో మెసేజ్‌లు చూసిన తండ్రి ఈ ప్రేమ వ్యవహారాన్ని మానుకోవాలని కూతురికి నచ్చజెప్పాడు. అయితే మహేశ్వరి వినలేదు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంచంపై పడుకుని ఉన్న కూతురు మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు.
ఆ తర్వాత శవాన్ని మంచం పక్కనే పడుకోబెట్టి మెడకు ఉన్న చున్నీకి మరో చున్నీ జతచేసి మంచానికి కట్టి ఉంచాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ విషయం బయటపడింది. మహబూబాబాద్ ఎస్డీపీవో రమాదేవి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. పోలీసుల విచారణలో భాగంగా జాగిలాన్ని రప్పించడంతో మృతురాలి మెడకు ఉన్న చున్నీ వాసనను చూసిన జాగిలం నేరుగా పోలీసుల అదుపులో ఉన్న సత్యనారాయణ వద్దకు వెళ్లింది. దీంతో సత్యనారాయణను విచారించగా వాస్తవాన్ని అంగీకరించాడు.












Click it and Unblock the Notifications