వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: మోపిదేవికి సిబిఐ కోర్టులో చుక్కెదురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు సిబిఐ కోర్టులో చుక్కెదురైంది. శనివారం ఉదయం మోపిదేవి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అనారోగ్య కారణంగా మూడు నెలలు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో మోపిదేవి బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. జైలు నుంచే మోపిదేవికి చికిత్స అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో ఓసారి కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయ్యప్ప మాలధారణలో ఉన్న మోపిదేవికి శబరిమల వెళ్లేందుకు ఈ ఏడాది జనవరి 2వ తేది వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. నిరుడు డిసెంబర్ 24వ తేదీన నుంచి ఈ ఏడాది ఏడాది జనవరి 2వ తేదీ వరకు కోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అస్తుల కేసులో ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు నిరుడు మే 24వ తేదీన అరెస్టు చేశారు. సిబిఐ విచారణకు హాజరైన మోపిదేవిని అరెస్టు చేశారు. వాన్‌పిక్ భూముల కేటాయింపులో ఆయన అరెస్టయ్యారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రిగా పనిచేసిన మోపిదేవి వాన్‌పిక్ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో సిబిఐ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.

English summary
CBI court has rejected the bail petition of former minister Mopidevi Venkataramana, accused in YSR Congress president YS Jagan DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X