తిరుమల: విహెచ్ వాహనంపైకి చెప్పులు, గుడ్లు

తిరుపతి: ఎట్టకేలకు భారీ భద్రత మధ్య తిరుమల కొండపైకి దిగిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకు సమైక్య సెగ తగిలింది. విహెచ్ వాహనాన్ని సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నెట్టేసేందుకు ప్రయత్నించారు. స్వల్పంగా లాఠీచార్జీ కూడా చేశారు. సమైక్యవాదుల్లో ఒకరి నుంచి విహెచ్ గులాబీ పూవు తీసుకున్నారు.

తాము ఆందోళన చేయబోమని గులాబీ పూలు అందిస్తామని చెప్పడంతో పోలీసులు ఐదుగురికి అనుమతించారు. అయితే, అలిపిరి వద్ద విహెచ్ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు వి. హనుమంతరావును అక్కడి నుంచి సురక్షితంగా ముందుకు తీసుకుని వెళ్లారు.

VH - Tirupathi

తెలంగాణకు చెందిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తిరుమల కొండపై చాలా సేపు. ఆయన కిందికి వచ్చిన వెంటనే నిరసన తెలియజేయడానికి సమైక్యావాదులు గులాబీ పూలతో కింద వేచి చూశారు. తిరుమల కొండపై నుంచి కిందికి వచ్చే రెండు మార్గాల వద్ద సమైక్యవాదులు విహెచ్ కోసం వేచి నించున్నారు. దాంతో పోలీసులు కూడా పెద్ద యెత్తున మోహరించారు. అయినా, సమైక్యవాదులు కిందికి రాగానే విహెచ్ వాహనాన్ని చుట్టుముట్టారు.

దీంతో పూర్తి భద్రత కల్పించే వరకు కిందికి రావద్దని హనుమంతరావుకు ఎస్పీ సూచించారు. హనుమంతరావు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. హనుమంతరావు విమానంలో హైదరాబాద్ బయలుదేరుతారని అన్నారు.

అంత వేడిలోనూ వి హనుమంతరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హైదరాబాద్ విడిచి వెళ్లాల్సిందేనని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం కాకుండా సాధారణంగా అయితే సీమాంధ్రులను హైదరాబాదులో ఉండనిస్తామని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎపి ఎన్జీవోల సమ్మెను రాజకీయ నాయకులే నడిపిస్తున్నారని ఆయన విమర్సించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+