రాష్ట్రమిస్తే రాహుల్‌ని నంద్యాల నుండి గెలిపిస్తాం: బైరెడ్డి

Rahul Gandhi
హైదరాబాద్/కర్నూలు: ప్రత్యేక రాయలసీమను ప్రకటిస్తే ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని నంద్యాల నుండి భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు తాము సిద్ధమని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదివారం అన్నారు. రాహుల్ గాంధీని మెదక్ నుండి పోటీ చేయించి గెలిపించుకోవాలని కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు.

తెలంగాణ ఇచ్చినట్లుగానే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ప్ర్తత్యేక రాయలసీమను ప్రకటించి రాహుల్ నంద్యాల నుండి పోటీ చేస్తే తాము మంచి మెజార్టీతో గెలిపిస్తామన్నారు. జివో నెంబర్ 72 రద్దు చేయకుంట్ కర్నూలు, కడప జిల్లాలకు శ్రీశైలం జలాలు రావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జంతర్ మంతర్ వద్ద విశాలాంధ్ర ధర్నా

రాష్ట్ర విభజనను నిరసిస్తూ విశాలాంధ్ర మహాసభ నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని తెలుగు ఉద్యోగులు, ప్రవాసాంధ్రులు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

విహెచ్‌పై దాడిని ఖండించిన శ్రీధర్ బాబు

చిత్తూరు జిల్లా తిరుపతిలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు పైన జరిగిన దాడిని మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం వేరుగా ఖండించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఇలాంటి దాడుల వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జఠిలమవుతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+