వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయమంటే సమైక్యవాదమా: జగన్‌పై కెకె, జిట్టా ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దృష్టిలో సమన్యాయం అంటే సమైక్యవాదమా? అని తెలంగాణ ప్రాంత సీనియర్ రాజకీయ నాయకులు కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డిలు ప్రశ్నించారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్ర సమితితో 2004లో పొత్తు పెట్టుకున్న విషయం మర్చిపోయారా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం పూటకోమాట మాట్లాడం సరికాదన్నారు. జగన్, విజయమ్మలది విభజన విషయంలో ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. పూటకో మాట్లాడటమే మీ విశ్వసనీయతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు ఏమాత్రం చీము, నెత్తురు ఉన్నా వారు వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీ లేని పార్టీకి పుట్టగతులుండవన్నారు. సమైక్య ఉద్యమం పేరుతో గందరగోళం సృష్టించవద్దన్నారు. సీమాంధ్రుల ఉద్యమం పెట్టుబడిదారుల ఉద్యమమని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమం పుట్టుడు ఉద్యమమన్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు పైన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజీనామాల నుండి రేపటి దీక్ష వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీది మొత్తం మోసమే అన్నారు. ఆ పార్టీ ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేస్తోందని నిప్పులు చెరిగారు.

English summary
Telangana regions senior political leaders KK 
 
 Mahender Reddy and Jitta Balakrishna Reddy were 
 
 fired at YSR Congress Party chief YS Jaganmohan 
 
 Reddy for his stand on division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X