వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీక్ష: సోనియాకి రాజీ! ప్రజలకు చిరు నామం!!(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు ప్రజాప్రతినిధులు దీక్షలు చేస్తున్నారు. విశాఖ జివిఎంసి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే రామానాయుడు ఆదివారం ఉదయం నిరాహార దీక్ష చేపట్టారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసమంటూ గుంటూరు జిల్లా పొన్నూరులో టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

విహెచ్ వ్యాఖ్యలను ఖండించిన బలరాం

ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు చేసిన వ్యాఖ్యనలు ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి బలరాం నాయక్ చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు.

విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగలో మంత్రి కొండ్రు మురళిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజును అడ్డుకున్నారు. సీమాంధ్రలోని జిల్లాల్లో ర్యాలీలు, ఆందోళనలు పందొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి.

సోనియా - చిరు

సోనియా - చిరు

ఎపిఎన్జీవోస్ తిరుపతి ఆధ్వర్యంలో రాజీనా సోనియాకు, నామాలు ప్రజలకు అంటూ ప్రదర్శిస్తున్న ఫ్లెక్సీ. అందులో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి తదితరులు తమకు నామాలు పెట్టారని పేర్కొన్నారు.

తిరుపతి

తిరుపతి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. వారు బస్టాండులలోనే నిరీక్షించారు. భక్తులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. టిటిడి కూడా కొంతమందిని తరలించింది.

తిరుపతి 1

తిరుపతి 1

బస్సు రావడంతో ఎక్కేందుకు గుమికూడిన భక్తులు. ఓ వ్యక్తి కిటికీ గుండా లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న దృశ్యం. గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏదైనా వాహనం వస్తే వారు పరుగులు పెడుతున్నారు.

ప్రజా బ్యాలెట్

ప్రజా బ్యాలెట్

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ చిత్తూరు జిల్లాలో ప్రజా బ్యాలెట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రజా బ్యాలెట్ అనే పేరుతో ఏర్పాటు చేసిన దాంట్లో ఓటు వేస్తున్న సమైక్యవాదులు

సమస్య

సమస్య

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. వారు బస్టాండులలోనే నిరీక్షించారు. భక్తులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. టిటిడి కూడా కొంతమందిని తరలించింది. ఓ బస్సు రావడంతో సీటు కోసం వెతికేందుకు మహిళ బస్సును ఎక్కిన దృశ్యం.

ఊడ్చుతూ నిరసన

ఊడ్చుతూ నిరసన

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మహిళలు, పురుషులు రహదారిని ఊడుస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం. సీమాంధ్ర జిల్లాల్లో వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు.

నాదం

నాదం

తెలంగాణ వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు అంటూ వినూత్నంగా నిరసన తెలుపుతున్న దృశ్యం. రాష్ట్రాన్ని విడదీయవద్దని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే నిరసన

ఎమ్మెల్యే నిరసన

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే టివి రామారావు సమైక్యాంధ్రకు మద్దతుగా అరగుండు గీయించుకొని నిరసన తెలిపారు. ఆయన సమాక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు.

రక్తాన్నైనా చిందిస్తా...

రక్తాన్నైనా చిందిస్తా...

రక్తాన్నైనా చిందిస్తా.. సమైక్యాంధ్ర సాధిస్తాం అంటూ ఉన్న ఫ్లెక్సీ పైన సంతకాలు చేస్తున్న సమైక్యవాదులు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి దీనిని తిరుపతిలో ఏర్పాటు చేసింది.

భూమన

భూమన

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. మాకిక కృష్ణ నీళ్లు కాదు.. కన్నీళ్లే గతి అంటూ మహిళలు ఖాలీ బిందెలతో నిరసన తెలిపారు.

తిరుపతి 2

తిరుపతి 2

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ఐక్యకార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు. పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి, అల్లూరి సీతారామ రాజు ఫోటోలతో ఈ ఫ్లెక్సీలను తిరుపతిలో ఏర్పాటు చేశారు.

పూజ

పూజ

సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని విడదీయవద్దని కోరుతూ వ్రతం చేస్తున్న సమైక్యవాదులు. అమ్మవారికి దండం పెడుతున్న దృశ్యం.

English summary
The Samaikyandhra agitation hit a feverish pitch after it entered its third week. Acquired momentum with leaders from Opposition parties backing the agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X