వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి తీసుకో: కెసిఆర్‌కు టిజి వెంకటేష్ తనయుడి ఆఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్/కర్నూలు: సమైక్యాంధ్రకు మద్దతు తెలిపితే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాము రూ.కోటి ఇస్తామని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ తనయుడు, యువజన కాంగ్రెసు నాయకులు టిజి భరత్ శనివారం చెప్పారు. ఆయన కర్నూలు జిల్లా కాంగ్రెసు పార్టీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు కూర్చున్న వారికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. కెసిఆర్ సమైక్యాంధ్రకు జైకొడితే విరాళాలు సేకరించి కోరినంత డబ్బు ఇవ్వగలమని అన్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా ముఖ్యమంత్రి సీటును, దాని ద్వారా డబ్బు సంపాదనే కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కెసిఆర్‌కు డబ్బులివ్వడానికి తన టిజివి గ్రూప్ నుంచి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి దానికి సంబంధించిన చెక్‌ను మీడియాకు ప్రదర్శించారు.

ఇంతేగాక కెసిఆర్ సమైక్యాంధ్రకు అనుకూలంగా మారితే కోరినంత డబ్బు ఇవ్వడానికి సిద్ధమవుతామని, అందుకు విరాళాల కోసం పిలుపునిచ్చారు. ఇప్పటికే 40 చెక్కులు సిద్ధమైనట్లు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజలు ఇచ్చే డబ్బుతో 10 ఫామ్ హౌస్‌లు కట్టించుకుని తెలంగాణవాదం నుంచి వైదొలగాలని సూచించారు. కాగా, తమను చులకన చేస్తూ ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమని, నోరు అదుపులో పెట్టుకోవాలని భరత్‌ను తెరాస హెచ్చరించింది.

ముఖ్యమంత్రితే కేంద్రమంత్రి భేటీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ఆదివారం సమావేశమయ్యారు.

ఎస్మా ప్రయోగం దురదృష్టకరం: బాపిరాజు

సీమాంధ్రలో ఎపిఎన్జీవోలపై ఎస్మా ప్రయోగం దురదృష్టకరమని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టుబడిదారులు ఉన్నారన్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. కిరణ్ ధైర్యవంతుడని, ఆయనకు తాము మద్దతిస్తున్నామన్నారు. సరైన సమయంలో తాను రాజీనామా చేస్తానని చెప్పారు.

English summary

 The AP minister for minor irrigation TG Venkatesh's son TG Bharath offered one crore rupees to TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X