ప్రాణాలకు తెగించి విజయమ్మ దీక్ష, మా బాటలో..: పద్మ

Vasireddy Padma
హైదరాబాద్/గుంటూరు: తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రాణాలకు తెగించి దీక్షకు దిగుతున్నారని, సమైక్యాంధ్ర కోసం మంత్రుల సతీమణులను అభినందిస్తున్నామని కానీ, మంత్రులు మాత్రం కొంగుచాటున దాక్కుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆదివారం మండిపడ్డారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించి విజయమ్మ దీక్ష చేస్తున్నారన్నారు.

ఆ దీక్షను ఆపేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. దీక్షను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుటిలయత్నం చేస్తోందని ఆరోపించారు. తాము అవనిగడ్డలో పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు తమకు కోడ్ వర్తించదన్నారు. విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం వచ్చినప్పుడు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను ఇంకెత కాలం మోసం చేస్తారన్నారు. కాంగ్రెసు నేతలను తరిమివేసే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు.

కాంగ్రెసు నేతలలా డ్రామాలు ఆడే వారు ఎవరైనా ఉంటారా అన్నారు. నిర్ణయం వచ్చినప్పుడు సీమాంధ్ర ఏడారి అవుతుందనే విషయం కాంగ్రెసు నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. వారికి ఓట్లు, సీట్లు తప్ప సీమాంధ్ర ప్రజల కష్టాలు పట్టవని మండిపడ్డారు సమైక్య ఉద్యమంలో తమ పార్టీయే ముందంజలో ఉందన్నారు. తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగానే విజయమ్మ దీక్ష చేస్తున్నారన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయమంటే శాసనమని వారే చెబుతారు.. నిర్ణయం మార్చుకుంటారని మళ్లీ వారే అంటారని విమర్శించారు. ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారన్నారు. మంత్రుల భార్యలను తాము అభినందిస్తున్నామన్నారు. వారు గవర్నర్ వద్దకు వెళ్లి సమైక్యాంధ్రకు అనుకూలంగా విజ్ఞప్తి చేస్తే, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరన్నారు. వారు కొంగుచాటున దాక్కున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెసు పార్టీ ఇందిరా సమైక్య కాంగ్రెసు పేరిట కొత్త పార్టీ అంటూ నాటకానికి తెరలేపుతోందన్నారు. కాంగ్రెసు నేతల రాజీనామాల్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం మొదట రాజీనామా చేసింది తమ పార్టీ నేతలే అన్నారు. తమ పార్టీ బాటలో మిగిలిన వారు ఎందుకు నడవలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+