వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై వెనుకడుగు!: హరికృష్ణ సమైక్య నినాదం, నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nandamuri Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తెలంగాణపై వెనుకడుగు వేశారు! సమైక్యవాదం వినిపిస్తూ ఆయన సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. పది రోజుల క్రితం ఓ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు బాధ అయినా విభజనకు అంగీకరిస్తున్నానని లేఖ రాసిన హరి.. అంతలోనే సమైక్యవాదం వినిపిస్తూ మరో లేఖ విడుదల చేశారు. అయితే తన లేఖతో పార్టీకి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు.

తన ఆత్మావిష్కరణ అంటూ ఈ లేఖను రాశారు. తెదేపా కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించానని కానీ, ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని రావణకాష్టంలా రగిలించిందని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియ ప్రారంభం కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, అది సీమాంధ్రులను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

సమైక్యానికి తాను కేవలం ఆత్మ ప్రబోధానుసారమే ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. తెలుగు జాతి కోసం అప్పట్లో తన తండ్రి చేసిన ప్రసంగాలు తన చెవులలో మార్మోగుతున్నాయన్నారు. సమైక్యాంధ్ర కోసం యువత ప్రాణాలను అర్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడం అమానుషమన్నారు.

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తాను సమైక్యానికే కట్టుబడి ఉండడం సమర్థనీయమని ఆ దిశలో ముందడుగు వేస్తున్నానని చెప్పారు. ఉద్యమంలో అసువులు బాసిన సోదరులకు నివాళులు అన్నారు. విభజనపై ఏకాభిప్రాయంతో కాకుండా చిచ్చు పెట్టేలా కాంగ్రెసు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. తాను ఇన్నాళ్లు ఎన్నో నిద్రలేని రాత్రులతో సతమతమవుతున్నానని చెప్పారు.

English summary
Telugudesam Party senior MP Nandamuri Harikrishna on Monday said that he is committed United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X