వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌పై చెప్పులేసినప్పుడు ఏమైంది: హరిపై హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
కరీంనగర్: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాసిన బహిరంగ లేఖపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. హరికృష్ణ బహిరంగ లేఖపై తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని హరికృష్ణ అంటున్నారని, బావ చంద్రబాబు పంచన చేరి చెప్పులు వేసినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా అని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారిక నివాసంలో సమావేశమై సమైక్యవాదాన్ని వినిపించడం కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించడమేనని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ దీక్షను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు సీమాంధ్ర నేతల దీక్షలపై ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన అడిగారు. రాష్ట్రంలో రెండు చట్టాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు. దీనికి డిజిపి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని తెరాస శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ విమర్సించారు. సమైక్యవాదానికి అనుకూలంగా దీక్ష చేస్తున్న తెలుగుదేశం నాయకుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరిపై అనర్హత వేటు వేయాలని శాసనసభ్యుడు గంగుల కమలాకర్ చంద్రబాబును డిమాండ్ చేశారు. ఎవరి అనుమతితో దీక్ష చేస్తున్నారో స్పష్టం చేయాలని ఆయన కోరారు.

English summary
Telangana Rastra Samithi MLA T Harish Rao retaliated Telugudesam party Rajyasabha member Nandamuri Harikrishna's comments on the formation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X