విభజిస్తే హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం: కావూరి యూ టర్న్

విభజన అనివార్యమైతే మాత్రం హైదరాబాదే సమస్య అన్నారు. యుటిగా లేదా ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరు రాజధానులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం తాము రాజీనామాలకు సైతం వెనుకాడే ప్రసక్తి లేదన్నారు.
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను తమ పార్టీ అధిష్టానం గుర్తించిందని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే లాభమేమిటో తాము అధిష్టానానికి వివరిస్తామన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో అధిష్టానం వైఖరిలో మార్పు వస్తుందని తాము భావిస్తున్నామన్నారు.
హైదరాబాదును వదులుకునేందుకు సీమాంధ్రులు సిద్ధంగా లేరన్నారు. నగర అభివృద్ధిలో మూడు ప్రాంతాల వారి పాత్ర ఉందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తొమ్మిది మంది మంత్రులం ఒత్తిడి తెచ్చామని, కలిసుంటే ఏ రకంగా మంచిదో శాస్త్రీయంగా మరీ మరీ చెప్పామన్నారు.
కాగా, కావూరి సాంబశివ రావు గత కొద్ది రోజుల్లో విభజన విషయంలో రెండుసార్లు యూ టర్న్ తీసుకున్నారని చెప్పవచ్చు. కేంద్రమంత్రి కాకముందు ఆయన పచ్చి సమైక్యవాదిగా ముద్రపడ్డారు. కేంద్రమంత్రి అయ్యాక ఆయన మాటల్లో తేడా కనిపించింది. సమైక్యవాదిని అయినప్పటికీ తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. బహిరంగంగా తక్కువగా మాట్లాడారు. తాజాగా సమైక్యమే తమ మొదటి డిమాండ్ అని, తప్పనిసరైతే హైదరాబాదును యూటి లేదా ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. వారు రాత్రి ఎనిమిది గంటలకు అంటోనీ కమిటీని కలువనున్నారు.












Click it and Unblock the Notifications