వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి: బాబుకు లక్ష్మీ పార్వతి హెచ్చరిక, కెసిఆర్‌పై ఎద్దేవా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్/విజయవాడ/విశాఖ: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విడదీయమని రెండుసార్లు లేఖలు ఇచ్చారని, ఇలా రెండు కళ్ల సిద్ధాంతాలతో ముందుకు వెళ్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని లక్ష్మీ పార్వతి ఆదివారం హెచ్చరించారు. తెలుగుజాతిని సమన్వయ పరిచి, తెలుగు భాషా సంస్కృతులను విశ్వవ్యాప్తం చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.

సమైక్యాంధ్ర సమితి విలేకరుల సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోతే శ్మశానం అయిపోతుందని చెప్పారు. పనికిమాలిన వారు అడిగితే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పూనుకోవటం దారుణమన్నారు. జ్ఞానం లేకుండా, తెలివిలేకుండా ప్రకటన చేశారన్నారు.

సోనియా ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడలో ఆంధ్రప్రదేశ్ బలయిపోయిందన్నారు. ఇటలీ సోనియా గాంధీ, కేరళ ఆంటోని, కర్ణాటక వీరప్ప మొయిలీ, మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్, తమిళనాడు చిదంబరం ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయించుకోవటం అన్యాయమన్నారు. అసలు రాష్ట్రాన్ని విడదీసే అధికారం వీరికి ఎక్కడుందని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా భావిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆంధ్రులు వెళ్లిపోయి, ఉద్యోగాలు చేసుకోవాలని కెసిఆర్ సూచించటం ఏమాత్రం సరైనది కాదన్నారు. అందరి రక్తాన్ని ధారపోస్తేనే హైదరాబాద్ నిర్మాణం జరిగిందన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారన్నారు.

English summary
NTR TDP chief Laxmi Parvathi has warned Telugudesam Party chief Nara Chandrababu Naidu over division issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X