సిఎం పదవి కోసమే టి, వైయస్ బతికుంటే...: మేకపాటి

2009లో మహాకూటమితో ఎన్నికల బరిలోకి దిగిన తెరాస కేవలం పదిస్థానాలలోనే గెలుపొందిందని, వైయస్ మరికొన్నాళ్లు బతికుంటే ఆ పదిమంది కూడా కాంగ్రెసు పార్టీలో చేరే వారన్నారు. తెలంగాణ ప్రాంత నాయకులైన కెసిఆర్, మర్రి చెన్నా రెడ్డిల పైన తమకు అమిత గౌరవముందని కానీ, రాజకీయ నిరుద్యోగులుగా మారిన నేతలు పదవుల కోసం విభజనను తెరపైకి తెస్తున్నారన్నారు. ఇది చరిత్ర చెబుతున్న నిజమన్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందిందన్నారు. ఆధునిక హైదరాబాదు అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
అంతకుముందు విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్షను ప్రారంభించారు. అందరికీ సమన్యాయం చేయనప్పుడు విభజన వద్దనే డిమాండుతోనే తాను దీక్ష చేస్తున్నట్లు ఆమె చెప్పారు. రాజధాని, నీళ్లు, ఉద్యోగాల వంటి జఠిలమైన సమస్యలకు పరిష్కారం చూపాకనే విభజనకు మొగ్గు చూపాలన్నారు.












Click it and Unblock the Notifications