హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టి: రాజన్న దళం వంటా, సోనియాకు చెప్పులు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ/గుంటూరు/విజయవాడ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్షను ప్రారంభించారు. సమన్యాయం చేయని పక్షంలో రాష్ట్రాన్ని విభజించవద్దని ఆమె డిమాండ్ చేశారు.

గుంటూరులోనే టిడిపి నేతలు నన్నపనేని రాజకుమారి,క యరపతినేని శ్రీనివాస రావు, మాజీ మంత్రి అరుణలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సమైక్యవాదులు పాల్గొన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో ఉద్యోగులు విధులను బహిష్కరించారు. చెవిలో బంతిపూలు, కేంద్రమంత్రుల మాస్కులతో వారు నిరసన తెలిపారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులకు గజల్ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవీంద్ర నాథ్ రెడ్డి తదితరుల దీక్షలు ఆయా జిల్లాల్లో కొనసాగుతున్నాయి. టిడిపి నేత నరేంద్ర దీక్ష కొనసాగుతోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి దీక్షకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. మరోవైపు సీమాంధ్రలో పలుచోట్ల ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది.

ఒంగోలులో

ఒంగోలులో

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యవాదులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం. ఈ కార్యాక్రమంలో సమైక్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు

పొట్టి శ్రీరాములు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తున్న సమైక్యవాదులు. వి వాంట్ జస్టిస్ అంటూ నిరసన గళం విప్పారు.

తిరుపతి

తిరుపతి

చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో సమైక్యాంధ్ర తిరుపతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న దృశ్యం. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తూ యూపిఏ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

 రోడ్డు పైన

రోడ్డు పైన

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న దృశ్యం.

భూమన

భూమన

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో రోడ్డు పైన వంటా వార్పు నిర్వహిస్తున్న దృశ్యం.

ఫ్లెక్సీ

ఫ్లెక్సీ

విభజనను వ్యతిరేకిస్తూ వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. పాలకుల పాపం, జనానికి కోపం, భావితరాలకు శాపం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. ఇందులో రాజకీయ పార్టీల పైన మండిపడ్డారు.

విశాఖలో

విశాఖలో

విశాఖలో తెలంగాణ వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు అంటూ సమైక్యవాదులు ఆందోళన తెలుపుతున్న దృశ్యం. విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పుల దండ వేశారు.

మోకాలిపై నడక

మోకాలిపై నడక

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైజాగ్‌లో మోకాలిపై నడుస్తూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు. రాష్ట్రాన్ని విభజించవద్దని వారు డిమాండ్ చేశారు.

దగ్దం

దగ్దం

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ద్వారం ఎదుట దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న సమైక్యవాదులు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.

English summary

 Rallies, human chains and hunger strikes for keeping the State united continued as part of the Samaikhyandhra agitation in the city on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X