వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐనా కేసులా, మా ప్రభుత్వమైనా జగన్ చెప్పిందే: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుమలలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతానని చెప్పినా తనపై కేసులు పెట్టడమేమిటని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం మండిపడ్డారు. ఇలాంటి కేసులకు తాను భయపడే ప్రసక్తి లేదన్నారు. సీమాంధ్రులే తెలంగాణ ప్రాంతం వారిని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ భక్తులను సీమాంధ్రలో ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వారి పైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతానన్నప్పటికీ కేసులు దురదృష్టకరమన్నారు. తనపై దాడి చేసిన వారి పైన కేసులు వద్దని తాను డిజిపి, ముఖ్యమంత్రిలకు చెప్పానన్నారు.

తాను ఓ పార్లమెంటు సభ్యుడినని, అలాంటిది తనను విచారించకుండానే ఎలా కేసులు పెడతారని మండిపడ్డారు. ప్రభుత్వం కాంగ్రెసు పార్టీదే అయినప్పటికీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పినట్లుగా జరుగుతోందన్నారు.

ఆవేశాలకు తలొగ్గి నిర్ణయం తీసుకోవద్దు: శైలజానాథ్

కొందరి ఆవేశాలకు తలొగ్గి విభజనపై నిర్ణయం తీసుకోవడం సరికాదని మంత్రి శైలజానాథ్ వేరుగా అన్నారు. తాము రేపు ఆంటోనీ కమిటీని కలుస్తామని, రెండో ఎస్సార్సీ ఏమైందని ప్రశ్నిస్తామని చెప్పారు. విభజనతో వచ్చే సమస్యలకు ఏం పరిష్కారం చూపిస్తారన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే వ్యతిరేకిస్తామన్నారు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విభజన సరికాదన్నరు.

English summary
Congress Party senior MP V Hanumantha Rao on Monday questioned about cases which filed against him in Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X