వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలం టీ యాత్రాబస్సుకు బ్రేకులు: అసభ్యరాతలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Seemandhra protests obstruct Telangana bus
మహబూబ్‌నగర్: దైవదర్శనాలకు కూడా సమైక్య సెగలు తగులుతున్నాయి. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి బయలుదేరిన తెలంగాణ యాత్రికులను సమైక్య ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంగారెడ్డి డిపోకు చెందిన ఏపి23జెడ్ 0084 నంగర్ గల ఆర్టీసి బస్సును సున్నిపెంట దగ్గర సమైక్యవాదులు అడ్డుకున్నారు.

దాదాపు రెండు గంటల పాటు ఆర్టీసి బస్సులో వచ్చిన భక్తులతో పాటు డ్రైవర్, కండక్టర్‌తో పాటు రోడ్డుపైనే దిగ్బంధించారు. దీంతో భక్తులు సమైక్యవాదులను ఎంతగా వేడుకున్నా ఆందోళనకారులు వినలేదు. డ్రైవర్లు సాదక్ అలీ, కిష్టయ్య, కండక్టర్లు వెంకటేశ్వర్లు, ఎస్‌ఎం కుమార్‌లు భక్తులను ఇబ్బంది పెట్టొద్దని సమైక్యవాదులను ప్రాధేయపడ్డారు. దీంతో ఆగ్రహించిన సమైక్యవాదులు ఏకంగా డ్రైవర్ల ఉన్న డ్యూటీ కాగితాలను లాక్కొని అందులో జై సమైక్యాంధ్ర అంటూ రాశారు.

అదేవిధంగా కండక్టర్ల దగ్గర ఉన్నటువంటి ఎస్‌ఆర్‌ను తీసుకుని అందులో కూడా సమైక్యాంధ్ర అంటూ రాశారు. అదేవిధంగా సంగారెడ్డి బస్సుపై కెసిఆర్‌కు వ్యతిరేకంగా వాల్‌రైటింగ్ రాసి బస్సుతో పాటు శ్రీశైలంకు ఎవరు కూడా రావోద్దంటూ హుకుం జారీ చేశారు. బస్సుపై అసభ్యకరమైన రాతలు రాశారు. తమ ఆదేశాలను బేఖతారు చేస్తే బస్సును తగులబెడుతామని, దాడులు చేస్తామని హెచ్చరించారు.

దాంతో తప్పని పరిస్థితుల్లో మల్లికార్జునస్వామిని దర్శించుకోవల్సిన భక్తులు తిరిగి ఇంటి ముఖం పట్టారు. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు శ్రీశైలంకు వెళ్లకుండా సంగారెడ్డికి పయనమైంది. ఆదివారం రాత్రి ఆమనగల్లుకు చేరుకున్న భక్తులు సున్నిపెంటలో జరిగిన సంఘటనను తెలిపారు.

English summary
Unified Andhra visitors have obstructed the Telangana private bus, which is going to Srisailam to visit Mallikarjuna Swami.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X