సమైక్య ఆందోళన వేస్ట్, నిర్ణయం జరిగిపోయింది: రోశయ్య

కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం తీసుకునే నిర్ణయం శిరోధార్యమైనదని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరించడం సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తుందని రోశయ్య అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక రెండిటికీ సమాన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
బెంగుళూరులో వాసవీక్లబ్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రోశయ్య పాల్గొన్నారు. వాసవీభవన్ బ్రోచర్‌తోపాటు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వాసవీ క్లబ్ అధ్యక్షుడు పి.వి.మనోహర్ గుప్తా, కార్యదర్శి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
రోశయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2009 డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే, సీమాంధ్రకు చెందిన శాసనసభ్యలు బారులు తీరి రాజీనామాలు చేయడంతో తీర్మానాన్ని ఆయన శాసనసభలో ప్రతిపాదించలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనే రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications