వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ఢీకోని 35మంది మృతి, బెంగళూర్లో కూలిన భవనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Speeding train kills 12 people
పాట్నా/బెంగళూరు: బీహార్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. బమారా రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై నిలబడి రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ నిలిపేందుకు ప్రయత్నించిన వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 35 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు రైలు బోగీకి నిప్పు పెట్టారు.

మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కన్వారియాస్(శివ భక్తులు)లు ఉన్నారు. రాజ్యరాణి ఎక్స్‌‍ప్రెస్ వస్తున్న సమయంలో వారు ఈస్ట్ సెంట్రల్ పరిధిలోని సమస్తిపుర డివిజన్‌లో బమారా స్టేషన్‌లో ట్రాక్ పైన నిలబడి ఆపే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలంలోనే వేగంగా వెళ్తున్న రైలు కారణంగా 12 మంది చనిపోయారని అధికారులు చెప్పారు.

ఈ రైలు సహారా నుండి పాట్నా వెళ్తోంది. సంఘటన తర్వాత రైలు కొద్ది దూరం వెళ్లి ఆగింది. కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను లాగి కొట్టారు. ఆ తర్వాత బోగీకి నిప్పు పెట్టారు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొంతసేపటి వరకు రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.

జమ్ముకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం

జమ్ముకాశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది.

బెంగళూరులో కూలిన ఐదంతస్తుల భవనం

కర్నాటక రాజధాని బెంగళూరులో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. హోసూరు రోడ్డులోని నిమ్హాన్స్ వద్ద నిర్మాణంలో ఉన్న ఈ భవనం కూలడంతో ఆరుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

English summary
At least 12 people, most of them pilgrims, were crushed to death under the wheels of Saharsa-Patna Rajya Rani Express at Bhamara Railway Station in Bihar on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X