జగన్ ఆస్తుల కేసు: ధర్మానకు మళ్లీ సిబిఐ నోటీసులు

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూకేటాయింపులకు ప్రతిఫలంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా సిబిఐ అభియోగాలు ఉన్నాయి. అప్పట్లో ధర్మాన ప్రసాద రావు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో సిబిఐ ఆయనను విచారించేందుకు పూనుకుంది.
నోటీసుల నేపథ్యంలో ధర్మాన శ్రీకాకుళం నుండి హైదరాబాదుకు బయలుదేరే వచ్చే అవకాశాలున్నాయి. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం దాదాపు 8,864 ఎకరాలను సేకరించారు. ఇందులో రైతుల నుండి సేకరించిన భూమి ఉంది. ఈ భూమిని తక్కువ ధరకు ప్రభుత్వం సేకరించింది.
కాగా, జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి వాన్‌పిక్ అంశంలో ధర్మాన ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల వాన్‌పిక్ అంశంలో ఆయనను సిబిఐ విచారించింది. తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాన్‌పిక్ అంశంలో ధర్మానకు ఇటీవలే స్వల్ప ఊరట కోర్టు ద్వారా వచ్చింది. ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశంలో నోటీసులు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications