సమైక్యంలో రాయల అనైక్యత: జెసి గ్రూప్‌లోకి కొందరు!

ఈ రోజు రాత్రి ఎనిమది గంటలకు కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో బలంగా సమైక్య గళం వినిపించాలని సీమాంధ్ర నేతలు నిర్ణయించుకున్నారు. మంత్రి శైలజానాథ్ నాయకత్వంలో అందరు సమైక్యం తప్ప మరో దానికి అంగీకరించేది లేదని కమిటీకి తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి వంటి నేతలు మాత్రం విభజనపై అధిష్టానం నిర్ణయం తీసుకున్నందున సమైక్య వాదన వినిపిస్తూనే రాయల తెలంగాణను కోరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. జెసి వాదనతో అనంతపురం, కర్నూలు జిల్లాకు చెందిన పలువురు నేతలు ఏకీభవించినట్లుగా సమాచారం. రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సమైక్య అంటున్నప్పటికీ విభజన తప్పకుంటే రాయల టికి ఒకే అని చెబుతున్న విషయం తెలిసిందే. ఆయన అందుకోసం లాబీయింగ్ చేస్తున్నట్లుగా కూడా గతంలో వార్తలు వచ్చాయి.
సమైక్యం తప్ప మరొకటి లేదు: అనంత
సమైక్య రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని తాము అంగీకరించే ప్రసక్తి లేదని అనంతపురం ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఏకంగా ఉంచేందుకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు.
అంటోని కమిటీతో కిరణ్ భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి తొమ్మిది గంటలకు అంటోని కమిటీతో భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications