వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: హైదరాబాద్‌పై జయప్రద, డిగ్గీతో రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprada - Vijayasanthi
న్యూఢిల్లీ: 2014 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు, నటి జయప్రద విభజన అంశంపై పెదవి విప్పారు! రాష్ట్రాన్ని విభజించే పక్షంలో హైదరాబాదును రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా ఉంచాలని ఆమె కోరారు. సీమాంధ్రుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఆంటోనీ కమిటీని వేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీకి ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. విభజన అనివార్యమైతే హైదరాబాదును శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు.

డిగ్గీతో విజయశాంతి భేటీ

మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలుసుకున్నారు. ఆమెతో పాటు రఘునందన రావు కూడా డిగ్గీతో భేటీ అయ్యారు. కాంగ్రెసు పార్టీలో చేరే అంశంపై వారు చర్చించినట్లుగా సమాచారం.

స్వార్థం కోసమే విభజన: రాఘవులు

రాజకీయ స్వార్థం కోసమే కాంగ్రె స్ పార్టీ రాష్ట్ర విభజనకు తెర లేపిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. సిఐటియూ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసి తెలుగు ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందన్నారు.

ఏఐసిసి ఉపాధ్యక్షులురాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియాగాంధీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆక్షేపించారు. విభజనలో తమ పార్టీ ప్రమేయం లేదన్నారు. విభజనను సీమాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు విభజనకు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తల ఊపుతూ, ప్రజల వద్దకు వచ్చేసరికి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారని ఆరోపించారు.

English summary
Uttar Pradesh MP Jayaprada told to AK Antony Committee that If AP has to be divided, make Hyderabad permanent capital for both states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X