వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు తెలుగోడి దమ్ము చూపిస్తాం: పయ్యావుల

By Pratap
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
గుంటూరు/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలుగోడి దమ్ము ఏమిటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ పెద్దలు తమ తలరాతలు మారుస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన మంగళవారం గుంటూరులో అన్నారు.

కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పెత్తనం చేస్తుంటే మన పార్లమెంటు సభ్యులలు దద్దమ్మల్లా నోరు మూసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా డెల్టా ఎడారి అవుతుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యానికి ముందు కరువు లక్ష మందిని బలి తీసుకుందని, అది మళ్లీ కబళిస్తుందని ఆయన అన్నారు.

ప్రతిపాదనలు చూశాకే మద్దతు

రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు చూసిన తర్వాతనే తాము తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. కేవలం కాంగ్రెసు ఓట్లతోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందదని, తమ మద్దతు అవసరం పడుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కొత్త రాజధాని ఇస్తామంటే వద్దనే వారిని తాను రాష్ట్రంలోనే చూస్తున్నానని ఆయన అన్నారు సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టడం కాదు, నచ్చచెబుదామని ఆయన అన్నారు. దాడులు, ప్రతిదాడులతో సమస్య పరిష్కారం కాదని, అన్ని పార్టీల అధ్యక్షులం వెళ్లివారితో మాట్లాడుదామని ఆయన సూచించారు.

హైదరాబాద్‌పై నిర్ణయం కాంగ్రెసు సొంత విషయం కాదని ఆయన అన్నారు. సెప్టెంబర్ చివరి వారంలో పాలమూరు గర్జన పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తామని, ఈ సభకు తమ పార్టీ నేత సుష్మా స్వరాజ్ వస్తారని ఆయన చెప్పారు.

English summary
Telugudesam party leader Payyavula Keshav said that they will show the Telugu people strength to Congress president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X