పోలీసులకు కవిత రాఖీ: చిరంజీవి, పల్లం ఫోటోలకు చీర

ఈ నేపథ్యంలో కవిత, తెలంగాణ ఉద్యోగులు లోనికి వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు ఆమెను, ఉద్యోగులను అడ్డుకున్నారు. రాఖీ కట్టేందుకు వచ్చిన తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కవిత పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గేటు వెలుపల ఉన్న పోలీసులకు కవిత, ఇతర ఉద్యోగులు రాఖీ కట్టి వెళ్లారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావుకు వ్యతిరేకంగా సమైక్యవాదులు, విద్యార్థులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేబినెట్లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతావని వారు పేర్కొన్నారు. దానిని తొలగించాలని పోలీసులు హెచ్చరించారు. వారు ససేమీరా అనడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ సింహ గర్జనలో పాల్గొన్నారు. ఈ నెలాఖరులోగా సమైక్యాంధ్రకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నుండి ప్రకటన రాకుంటే తాను రాజీనామా చేస్తానని మంత్రి విశ్వరూప్ రాజమండ్రిలో ప్రకటించారు. వచ్చే నెల 2వ తేదిన తన రాజీనామాను గవర్నర్‌కు పంపిస్తానన్నారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సమైక్యవాదులు కేంద్రమంత్రులు చిరంజీవి, పల్లం రాజు ఫోటోలకు చీరలు కట్టి నిరసన తెలిపారు. పోలీసులు తొలగించాలని చెప్పినా వారు తగ్గలేదు.












Click it and Unblock the Notifications