జయంతి: రాజీవ్ గాంధీకి నివాళులు (చిత్రాలు)

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 69వ జయంతి వేడుకలను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) మంగళవారం గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పిసిసి మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ రావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, రాష్ట్ర మత్రులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడడానికి, దేశ సర్వతోముఖాభివృద్ధికి రాజీవ్ గాంధీ అమోఘమైన సేవలు చేశారని వక్తలు కొనియాడారు. కొన్ని మతతత్వ శక్తులు దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఆ శక్తులు ఐకమత్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో సున్నిత పరిస్థితులను సాకుగా తీసుకుని, దేశ సమగ్రతకు పాటుపడిన ఇందిరా, రాజీవ్ గాంధీల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులను ఆసరాగా తీసుకుని కొన్ని దుష్ట రాజకీయ పార్టీలు కాంగ్రెసు పార్టీ నాయకత్వాన్ని పలుచన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ముక్తకంఠంతో వాటిని ఎదుర్కోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి నివాళులు

ముఖ్యమంత్రి నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాదులోని సోమాజిగుడాలో గల రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా చిత్రంలో ఉన్నారు.

గాంధీభవన్‌లో నివాళులు

గాంధీభవన్‌లో నివాళులు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెసు నాయకులు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు, మంత్రి దానం నాగేందర్ తదితరులు చిత్రంలో ఉన్నారు.

బొత్స నివాళి..

బొత్స నివాళి..

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలోని సున్నిత పరిస్థితులను సాకుగా తీసుకుని దేశసమగ్రతకు పాటుపడిన ఇందిరా, రాజీవ్ విగ్రహాలను కొన్ని శక్తులు ధ్వంసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

దానం నాగేందర్ నివాళి

దానం నాగేందర్ నివాళి

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దానం నాగేందర్. రాజీవ్ గాంధీ అంటే దానం నాగేందర్‌కు ఎనలేని అభిమానం.

సద్భావనా ప్రతిజ్ఝ

సద్భావనా ప్రతిజ్ఝ

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటైన సమావేశంలో ప్రతిజ్ఝ చేస్తున్న కాంగ్రెసు నాయకులు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు డి. శ్రీనివాస్, ఎం. సత్యనారాయణరావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు తదితరులు చిత్రంలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+