సోదరుడి అరెస్ట్: అసెంబ్లీ ముందు శంకరరావు మౌనదీక్ష

ముఖ్యమంత్రి, డిజిపిలు తమ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు చేస్తూ వేధించడం ద్వారా తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. తన సోదరుడిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని శంకర రావు చెప్పారు.
తనపై వచ్చిన ఆరోపణలపై తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రభుత్వానికి దమ్ముంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, శంకర రావు సోదరుడు దయానంద్‌ను సోమవారం ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రామ్ నగర్‌లోని జెమిని కాలనీలోని, అల్వాల్ మండలంలోని కానాజిగూడలో గ్రీన్ ఫీల్డు హౌసింగ్ సొసైటీలో శంకర రావుతో పాటు ఆయన సోదరుడు కూడా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో నిందితుడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications