టి: కెసిఆర్‌కు మందు, చిరంజీవి చేతిలో డబ్బు(పిక్చర్స్)

హైదరాబాద్: సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో సమైక్య ఉద్యమం రోజు రోజుకు ఎగిసిపడుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా సిబ్బంది విధులు బహిష్కరించడంతో పలు ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో రెండో రోజైన మంగళవారం కూడా ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. విశాఖలో సిబ్బంది విధులు బహిష్కరించడంతో ప్రభుత్వ, పాలిటెక్నిక్ కళాశాల, కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిలిచిపోయింది.

తెలంగాణ ప్రజలకు చెప్పులు వేసుకోవడం, వ్యవసాయం చేయడం నేర్పింది ఆంధ్రా ప్రజలేనని మాజీ మంత్రి, ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు సోమవారం వ్యాఖ్యానించారు. సీమాంధ్ర వాళ్లు కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చి కోట్లు సంపాదించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.

సోమవారం విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు నిరసన తెలపడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇరు ప్రాంతాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు కలుగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

మాట్లాడుతున్న కెటిఆర్

మాట్లాడుతున్న కెటిఆర్

విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు.

సమైక్యాంధ్ర కోసం పరకాల

సమైక్యాంధ్ర కోసం పరకాల

విద్యుద్ సౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు చేసిన నిరసనలో విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణలో పని చేసే సీమాంధ్ర ఉద్యోగులపై వివక్ష చూపరాదని ఎపిసిపిసిడిఎల్ సీమాంధ్ర ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు.

అదుపులోకి..

అదుపులోకి..

విద్యుత్ సౌధ వద్ద సోమవారం తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో పోలీసులు కలుగచేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

అరెస్ట్

అరెస్ట్

విద్యుత్ సోధ వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

సమైక్యాంధ్ర కోసం నిరసన

సమైక్యాంధ్ర కోసం నిరసన

సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కెసిఆర్‌కు మైండ్ దొబ్బింది... సోనియాకు పిచ్చి పట్టిందంటూ నిరసన తెలుపుతున్న సమైక్యవాది.

విద్యార్థుల నిరసన

విద్యార్థుల నిరసన

ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న విద్యార్థులు. కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ... విద్యార్థులు నిరసన తెలిపారు.

కెసిఆర్‌కు మందు, చిరుకు డబ్బు

కెసిఆర్‌కు మందు, చిరుకు డబ్బు

ప్రకాశం జిల్లాలో సమైక్యవాదులు వినూత్న నిరసన తెలిపారు. కెసిఆర్, కిల్లి కృపారాణి, చిరంజీవి, పురంధేశ్వరిల పేరుతో టోపీలు కెసిఆర్ వేషదారి ముందు మందు, చిరు వేషదారి చేతిలో డబ్బు, కృపారాణి చేతిలో అద్దం, పౌడర్ ఉన్న దృశ్యం.

తెలుగు తల్లి

తెలుగు తల్లి

సమైక్యాంధ్ర కోరుతూ తెలుగు తల్లి రూపంలో నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

నిలిచిపోయిన ఎంసెట్ కౌన్సెలింగ్

నిలిచిపోయిన ఎంసెట్ కౌన్సెలింగ్

సమైక్యాంధ్ర ఉద్యమ సెగ ఎంసెట్ కౌన్సెలింగు పైన పడింది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో చాలాచోట్ల కౌన్సెలింగ్ నిలిచిపోయింది.

విద్యార్థులు నిరీక్షణ

విద్యార్థులు నిరీక్షణ

ఎంసెట్ కౌన్సెలింగుకు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగలడంతో వైజాగ్‌లోని ఓ కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, బంధువులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+