లోకసభలో ప్రధాని సీట్లో కూర్చున్న సుష్మా స్వరాజ్

ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని తిరిగి వచ్చిన సుశీల్ కుమార్ ఆరోగ్యం గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఆమె ప్రధాని సీట్లో కూర్చున్నారు. యుపిఎ చైర్ పర్సన్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సుశీల్ కుమార్ షిండేకు అవతలి వైపు కూర్చున్నారు.
ఆ తర్వాత ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, డిఎంకె నేత టిఆర్ బాలు, బిజెపి నేత మురళీ మనోహర్ జోషీ, తెలుగుదేశం పార్టీ నేత నామా నాగేశ్వర రావు, సస్పెండయిన బిఎస్పీ ఎంపి విజయ బహదూర్ సింగ్ షిండే వద్దకు వెళ్లి పలకరించారు. షిండే ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
72 ఏళ్ల షిండే ఈ నెల ప్రారంభంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఊపిరితిత్తులకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఆయన ఇప్పటి వరకు వర్షాకాలం పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications