తేజస్విని పెళ్లి: హరి దూరం, టివిలో చూసిన జూ.ఎన్టీఆర్!

కల్యాణ్ రామ్ హాజరు..
వివాహానికి హరికృష్ణ పెద్ద కుమారుడు కల్యాణ్ రామ్ హాజరయ్యారు. హరికృష్ణ, జూనియర్ ఫ్యామిలీ మాత్రం దూరంగా ఉంది. తన తనయుడు జూనియర్‌కు పిలుపు అందనందునే హరికృష్ణ కూడా దూరంగా ఉండి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తేజస్విని వివాహ వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ టివీలలో వీక్షించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద వేడుకకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటంతో వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగానే అందరూ భావిస్తున్నారు.
కాగా, కొద్దికాలంగా నందమూరి కుటుంబంలో వారసత్వం విషయంలో గొడవలు రాజుకున్న విషయం తెలిసిందే. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తర్వాత వారసత్వం కోసం ఎన్టీఆర్, నారా లోకేష్‌ల కోసం పార్టీలో పోటా పోటీ నెలకొన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి నుండి బాబు పట్ల అసంతృప్తితో ఉన్న హరికృష్ణ వారసత్వం విషయానికి వచ్చేసరికి జూనియర్ కోసం పట్టు మీద ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. హరికృష్ణ ఓ సందర్భంలో మాట్లాడుతూ... తాము నష్టపోయామని, తమ వారసులు కూడా నష్టపోవాలా అని ప్రశ్నించారు.
స్వర్గీయ నందమూరి తాకర రామారావు ఫోటోలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వినియోగించుకోవడం మొదలు నిన్నటి తెలంగాణ అంశం వరకు హరికృష్ణ పార్టీతో విభేదిస్తూ వస్తున్నారు. అందుకు హరిలో ఉన్న వారసత్వ అసంతృప్తేనని అంటారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి కచ్చితమైన స్టాండ్ తీసుకుంటే... వ్యక్తిగతమంటూ హరికృష్ణ నిన్న సమైక్యాంధ్రకు అనుకూలంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇప్పుడు బాలయ్య కూతురు పెళ్లికి దూరంగా ఉన్నారు. వీటన్నిటిని పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు హరికృష్ణ సీమాంధ్రలో పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications