ఇదీ పరిస్థితి, టి వద్దు!: సోనియాను కలవనున్న కిరణ్

Sonia Gandhi - Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ఆంటోని కమిటీ మరోసారి సమైక్య వాదన బలంగా వినిపించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారని తెలుస్తోంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఆయన అధినేత్రిని కోరనున్నారు. జూలై 30 సిడబ్ల్యూసి ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను పూర్తిగా వివరించి, విభజనతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముందని ఆయన చెప్పనున్నారని సమాచారం.

కాగా, మంగళవారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన ముఖ్యమంత్రి సమైక్యమే అన్ని సమస్యలకు పరిష్కారమని సూచించిన విషయం తెలిసిందే. ఇరు ప్రాంతాలు పరస్పరం ఆధారపడ్డాయని, విభజన ఎవరికీ మంచిది కాదని చెప్పారు. విభజనతో కొత్త సమస్యలు వస్తాయే తప్ప పరిష్కారమయ్యేదేమీ ఉండదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జలవనరుల పంపిణీ, ఒక డ్యాంను రెండు ప్రాంతలు పంచుకోవడం వంటివి ఉంటాయన్నారు.

నీటి యుద్ధాలు జరిగే అవకాశముందని, ప్రజల మధ్య వైషమ్యాలు వస్తాయని చెప్పారు. విద్యుత్ విషయంలో తెలంగాణలో ఘోర పరిస్థితి ఏర్పడవచ్చునని, సీమాంధ్రులకు వైద్యానికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని, విడిపోతే వారు ఇబ్బందులు పడతారని తెలిపారు.

ఢిల్లీలోనే సీమాంధ్ర నేతల మకాం

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ రోజు కూడా వారు పలువురు నేతలను కలిసి సమైక్యవాదం వినిపించనున్నారు. మంగళవారం రాత్రి ఆంటోని కమిటీని కలిసిన వారు సమైక్యవాదన వినిపించారు. హైదరాబాద్, నీళ్లు అసలు సమస్య అని చెప్పారు. విడదీస్తే నష్టమని, తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలని చెప్పారు. పలువురు రాయల తెలంగాణ విజ్ఞప్తి చేశారు. అయితే, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ముందు అంటోని కమిటీ మౌనముద్ర వహించింది. వారు చెప్పిన విషయాలను సావధానంగా వినడం తప్పితే ఏం మాట్లాడలేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+