జగన్‌తో నడిస్తే మా గతే: కొండా సురేఖ, కిరణ్‌పై కెటిఆర్

జగన్ వెంట నడిస్తే వైయస్ ఆశయాలను సాధించలేమని ఆమె ఇరు ప్రాంతాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు సూచించారు. తమకు పట్టిన గతే సీమాంధ్ర వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ కోసం తెలంగాణ వాళ్లు చనిపోతే ఇప్పుడు అది సీమాంధ్ర పార్టీ అయిందన్నారు. జగన్ పార్టీలో వైయస్‌ను ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన వారికే ప్రాధాన్యం ఉందన్నారు.
జగన్‌లా పార్టీ పెట్టాలని కిరణ్: కెటిఆర్
కాంగ్రెసు నుండి బయటకు వచ్చి పార్టీ పెట్టిన జగన్‌లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ పెట్టాలని చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు వేరుగా అన్నారు. ఆంటోని కమిటీ భేటీలో కిరణ్ పచ్చి అవాస్తవాలు చెప్పారని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కమిటీ ముందు అబద్దాలు చెప్పిన కిరణ్‌కు లైడిటెక్టర్ పరీక్షలు జరపాలన్నారు. కిరణ్ చెప్పిన వాటిపై తాము చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు ఇంకా ఆయన మంత్రివర్గంలో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని దోచుకునేందుకే: సారయ్య
రాష్ట్రాన్ని మరింత దోచుకునేందుకే విజయమ్మ దీక్ష చేస్తున్నారని, ఆమెకు విశ్వాసం లేదని మంత్రి బస్వరాజు సారయ్య వరంగల్‌లో అన్నారు.
మా పాత్ర పోషించాం: యాష్కీ
తెలంగాణ సాధనలో తమ వంతు పాత్ర పోషించామని కాంగ్రెసు పార్టీ ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్‌లు హైదరాబాదులో అన్నారు. సీమాంధ్రులది సమైక్య ఉద్యమం కాదని, హైదరాబాదు కోసం జరుగుతోందన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications