పదేళ్లకు అంగీకరించం: హైదరాబాద్‌పై హరీష్ మెలిక

Harish Rao
సిద్దిపేట/ హైదరాబాద్: హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా చేయాలనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలోని తన నివాసంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారాన్ని కాంగ్రెస్ తన ఇంటి వ్యవహారంగా మార్చుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లి శాంతిభద్రతలు, రెవెన్యూ అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే ఉండాలని సూచిస్తున్నట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనన్న విషయాన్ని మరిచిపోవద్దని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిసీతెలియక ఇష్టానుసారం ప్రతిపాదనలు చేయవద్దని తెరా నాయకులు అన్నారు. పార్టీ ఎమ్మెల్యే కె.తారకరామారావు, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, కె.వి.రమణాచారి మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశాల్లో మాట్లాడారు.

హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల ప్రత్యేక రాష్ట్రమే కావాలని, హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ఇంటి వ్యవహారంగా చూడటం పద్ధతి కాదని, సొంత పార్టీ వాళ్లనే పిలిచి మాట్లాడుతున్నారని, వారికి చిత్తశుద్ధి ఉంటే అందరితో మాట్లాడాలని కెటి రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కనీసం ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేని అర్భకుడని, పచ్చి అబద్ధాలు చెప్పటానికి ముఖ్యమంత్రికి సిగ్గు లేదని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం కట్టుబడి ఉంటే, ఆ పార్టీ నేతలు తలో మాట ఎందుకు మాట్లాడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరారు. హైదరాబాద్‌పై కేంద్రం అజమాయిషీ చేయటం రాజ్యాంగపరంగా సాధ్యంకాదని వినోద్‌కుమార్, శ్రీహరి, రమణాచారి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని యూటీగా కూడా మార్చే అవకాశం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+