భారతికి రాఖీ కట్టేందుకు క్యూ, బిజెపి ఉల్లి గిఫ్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం పలువురు మహిళలు తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులకు, రాజకీయ పార్టీ నాయకులకు, పోలీసు అధికారులకు రాఖీలు కట్టారు. ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టేందుకు పలువురు మహిళలు వచ్చారు.
అధికారులు అనుమతించకపోవడంతో వారు జగన్ సోదరి షర్మిల, సతీమణి భారతిలకు, అక్కడే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి రాఖీలు కట్టారు. సీమాంధ్ర మహిళా ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ మహిళా ఉద్యోగులు సీమాంధ్ర ఉద్యోగులకు రాఖీ కట్టారు.
బిజెపి కార్యాలయంలో తమకు రాఖీ కట్టిన మహిళలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత వెంకయ్య నాయుడు తదితరులు ఉల్లిగడ్డలు ఇచ్చారు. ఉల్లి ధరల పెరుగుదలను నిరసిస్తూ వారు వినూత్నంగా నిరసన తెలిపారు.

జైలు వద్ద భారతికి రాఖీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతికి చంచల్ గూడ జైలు వద్ద రాఖీ కడుతున్న మహిళలు.

జైలు వద్ద షర్మిలకు రాఖీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు చంచల్ గూడ జైలు వద్ద రాఖీ కడుతున్న మహిళలు.

నార్సింగి
రాఖీ పండుగ సందర్భంగా బుధవారం హైదరాబాదులోని నార్సింగి ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులు ఇన్స్‌పెక్టర్ సంజయ్ కుమార్ తదితరులకు రాఖీ కట్టారు.

టిఎన్జీవో నేతకు సీమాంధ్ర ఉద్యోగుల రాఖీ
టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్‌కు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మహిళా ఉద్యోగులు రాఖీ కడుతున్న దృశ్యం. బుధవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పరస్పరం రాఖీలు కట్టుకున్నారు.

సిపికి రాఖీ
నగర పోలీసు కమిషనర్ రాఖీ కడుతున్న యువతి. రక్షా బంధన్ సందర్భంగా బుధవారం సిపికి పలువురు మహిళలు రాఖీ కట్టారు.

ఎపిఎన్జీవో
వైజాగ్‌లో జరిగిన సమైక్యాంధ్ర సభలో ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు రాఖీ కడుతున్న ఓ మహిళ. బుధవారం వైజాగ్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ బహిరంగ సభను నిర్వహించారు.

కోదండకు చిన్నారి
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌కు రాఖీ కడుతున్న ఓ చిన్నారు. ఆయన ఇందిరా పార్కు వద్ద తెలంగాణ శాంతి దీక్ష కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు.

కెటిఆర్‌కు కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు రాఖీ కడుతున్న దృశ్యం.

రాఖీ కడితే ఉల్లి
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. సోదరి రాఖీ కడితే సోదరుడు ఏదైనా ఇవ్వడం సంప్రదాయం. దానిని అనుసరిస్తూ బిజెపి నేతలు రాఖీ కట్టిన మహిళలకు ఉల్లిగడ్డలు ఇచ్చారు. ఉల్లిగడ్డల ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వారు వినూత్నంగా నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications