సమైక్య రగడ: క్విట్ సోనియా!, చీట్ కెసిఆర్!!(పిక్చర్స్)
హైదరాబాద్/విశాఖ/గుంటూరు: సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జిల్లాల్లో 23వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు భారీ ఎత్తువ ర్యాలీలు, ఆందోళనలు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. పలు డిపోల నుండి బస్సులు ఇప్పటికీ బయటకు రాడవం లేదు. ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
విభజనను నిరసిస్తూ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బందుకు రాజకీయ ఐకాస, ఎపిఎన్జీవోలు పిలుపునిచ్చాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంఘాలు మూతపడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యవాదులు రోడ్లపై తిరుగుతూ నినాదాలు చేశారు.
కర్నూలులో సమైక్యాంధ్ర కోసం లక్ష మందితో లక్ష గళ ఘోష కార్యక్రమం నిర్వహించారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రాజీనామా చేయగా, రాజ్యసభ చైర్మన్ దానిని ఆమోదించిన విషయం తెలిసిందే. హరి రాజీనామాను ఎపిఎన్జీవోలు స్వాగతించారు.

గజల్ శ్రీనివాస్
ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజమండ్రిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కర్నూలు
కర్నూలు జిల్లాలో సమైక్య ఉద్యమం ఊపందుకుంది. తమ ఆందోళనను అడ్డుకోవద్దని, సమైక్యానికి కట్టుబడాలని కోరుతూ ఓ సమైక్యవాది పోలీసు కాళ్లు పట్టుకొని నిరసన తెలుపుతున్న దృశ్యం

శ్రీకాకుళం
సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళంలో పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలుపుతున్న దృశ్యం. విద్యార్థులు ఆసనాలతో నిరసన వ్యక్తం చేశారు.

భారీ స్పందన
కృష్ణా జిల్లా విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్రాఫిక్
కృష్ణా జిల్లా విజయవాడలో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

పాలాభిషేకం
సమైక్యాంధ్రకు మద్దతుగా వైజాగ్‌లో తెలుగు తల్లికి పాలాభిషేకం చేస్తున్న సమైక్యవాదులు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

పాముతో నిరసన
సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు వినూత్న రీతుల్లో నిరసన తెలుపుతున్నారు. వైజాగ్‌లో తెరాస అధ్యక్షుడు కెసిఆర్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందు పాముతో నిరసన తెలుపుతున్న దృశ్యం

తిరుపతిలో..
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎదుట వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు.

క్విట్ అండ్ చీట్
చిత్తూరు జిల్లా తిరుపతిలో క్విట్.. క్విట్ సోనియా!, చీట్.. చీట్.. కెసిఆర్!! అంటూ నిరసన తెలిపిన సమైక్యవాదులు. వారి ఫోటోలకు సమైక్యవాదులు కొమ్ములు తగిలించారు.

మాక్ పార్లమెంట్
సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు బుధవారం మాక్ పార్లమెంటు నిర్వహించారు. ఉద్యోగులు విపక్ష, ప్రతిపక్ష సభ్యులుగా విడిపోయి నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications