వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే రాద్ధాంతం: సుష్మ, చెప్పిందొకటి: శివ ప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Siva Prasad - Sushma Swaraj
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే వ్యతిరేకిస్తున్నారని, విభజన తీరు అందర్నీ బాధిస్తున్నందు వల్లే ఇంత రాద్ధాంతమని లోకసభ ప్రతిపక్ష నేత, బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ గురువారం అన్నారు. విభజన విషయంలో సొంత పార్టీలోనే కాంగ్రెసు పార్టీ ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయిందని అభిప్రాయపడ్డారు. విభజన విషయంలో అనుచితంగా వ్యవహరించారని, విభజనకు వ్యతిరేకం కాకపోయినా, తీరు అందర్నీ బాధిస్తోందన్నారు.

చెప్పిందొకటి...: శివ ప్రసాద్

సభ ప్రారంభానికి ముందు విభజనపై అఖిల పక్షం వేస్తామని కమల్ నాథ్ తమతో చెప్పారని కానీ, సభలో మరోలా వ్యవహరించారని చిత్తూరు ఎంపి శివ ప్రసాద్ ఆరోపించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది కాంగ్రెసు పార్టీయే కాబట్టి చల్లార్చిన బాధ్యత ఆ పార్టీ పైనే ఉందన్నారు. మూడు ప్రాంతాల నుండి ఏకాభిప్రాయం వచ్చాకే నిర్ణయం చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, దీనిపై చర్చ జరగాలని కొణకళ్ల నారాయణ డిమాండ్ చేశారు.

తమను సస్పెన్షన్ చేయడాన్ని బిజెపి సహా అన్ని పార్టీలు వ్యతిరేకించాయన్నారు. తమ సస్పెన్షన్ పైన నిర్ణయం వెలువడలేదన్నారు. తమ రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి తెస్తామన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడే వరకు తాము ఆందోళన చేస్తామన్నారు. సీమాంధ్ర ప్రజల గోసను తాము సభలో వినిపిస్తే సస్పెండ్ చేస్తారా అని నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు.

దోపిడీలు, కుంభకోణాలు చేసే వారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదన్నారు. సీమాంధ్రలో సామాజిక వర్గాల వారిగా ఉద్యమం జరగడం లేదన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీకి ఏమైనా అనుమానాలు ఉంటే సీమాంధ్రలో పర్యటించి వాస్తవాలు తెలుసుకోవచ్చునని హితవు పలికారు.

English summary
Opposistion leader and BJP senior leader Sushma Swaraj on thursday responded on AP division issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X