ఉద్యమ సెగ: చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర వాయిదా

అయితే, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో అది సరికాదని పార్టీ నేతలు ఆయనను వారించినట్లుగా సమాచారం. ఉద్యమం తీవ్రస్థాయిలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో యాత్ర చేపట్టడం సరికాదని వారు బాబుకు నచ్చజెప్పారని తెలుస్తోంది. పార్టీ నేతల సూచనల మేరకు యాత్రను వాయిదా వేసుకున్నారు.
కాగా, చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు గురువారమే ముహూర్తం ఖరారు అయిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేది నుండి బాబు విశాఖ జిల్లా కొత్త వలస నుండి తన యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యాత్రలో ఆయన ప్రధానంగా అధికార కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు కుమ్మక్కయ్యాయని, టిడిపిని ఇరుకున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలకు చెప్పాలని భావించారు.
25వ తేదిన చంద్రబాబు విశాఖ విమానాశ్రయం నుండి బయలుదేరి విశాఖ నార్త్, పెందుర్తి మీదుగా కొత్త వలసకు చేరుకొని, అక్కడ భారీ ర్యాలీలో పాల్గొన్న అనంతరం తన ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలంగాణ, సీమాంధ్ర నేతలతో బాబు శుక్ర, శనివారాలు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే నేతల సూచనల మేరకు ఆయన యాత్రను వాయిదా వేసుకున్నారు. దీంతో ఇరు ప్రాంత నేతల భేటీ కూడా రద్దయింది.












Click it and Unblock the Notifications