సోనియాతో చిరు భేటీ, సభలోనే టిడిపి ఎంపీల నిరసన

టిడిపి ఎంపీలను బయటకు తెచ్చిన భద్రతా సిబ్బంది
లోకసభ వాయిదా పడిన అనంతరం కూడా తెలుగుదేశం పార్టీలో సభలోనే నిరసన వ్యక్తం చేస్తుండటంతో భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా బయటకు తీసుకు వచ్చారు. విభజనపై సభలో సీమాంధ్ర ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను శనివారానికి వాయిదా వేశారు.
సభ వాయిదా పడిన అనంతరం కూడా టిడిపి ఎంపీలు సభలోనే బైఠాయించారు. తమ స్థానాల్లోనే కూర్చొని నిరసన తెలిపారు. వారిని బయటకు పంపించేందుకు అధికారులు మార్షల్స్ సహాయం తీసుకున్నారు. మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకు వచ్చారు.
శివ ప్రసాద్‌కు వైద్య పరీక్షలు
సస్పెండైన్ అనంతరం లోకసభలోనే ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపి శివ ప్రసాద్‌కు వైద్యులు పరీక్షలు చేశారు. ఆయన బిపి, షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీంతో వైద్యులు పరీక్షలు జరిపారు. ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌లు వైద్యులను తీసుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications