ఓపికకు హద్దు, తప్పుడు రిపోర్ట్ సిఎం: హరీష్ హెచ్చరిక

అది నశిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఓ ప్రాంతానికి మద్దతు ఇస్తూ తప్పుడు నివేదికలను అందిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుడు నివేదికల సిఎంగా అభివర్ణించారు. 'తప్పుడు నివేదికల సిఎం తప్పుకో' అంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం నడుస్తున్న సీమాంధ్ర ఉద్యమాలు ఉత్తుత్తివేనన్నారు. ప్రజలను రోడ్డెక్కించి సీమాంధ్ర మంత్రుల తమ ఫ్యాక్టరీలను యథావిధిగా నడుపుతున్న విషయాన్ని అక్కడి ప్రజలు గుర్తించాలన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తేనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందని గుంటూరు జిల్లాలో శ్రీరాములు అనే వ్యక్తి ర్యాలీ చేయబోతే అనుమతి లేదంటూ అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ర్యాలీలకు, ధర్నాలకు అనుమతి ఉంటుంది గానీ ఎస్సీ, ఎస్టీల ఆందోళనలకు అనుమతి ఇవ్వరా? అని ప్రశ్నించారు.
రాష్ట్రం వస్తుంది: దామోదర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి అనుమానాలు వద్దని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం వేరుగా అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్ఠానం సాగదీత ధోరణితో వ్యవహారిస్తుందన్న విమర్శలు సరికాదన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో వికారాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ పోటీ చేస్తారని రాజనర్సింహ ప్రకటించారు. మాజీమంత్రి, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు డాక్టర్ ఎ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వికారాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుందని విలేకరులు ప్రశ్నించగా, వికారాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసాద్ కుమారే పోటీ చేస్తారని రాజనర్సింహ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications