సమైక్యం: హైద్రాబాద్‌కు పాస్‌పోర్ట్, టి ర్యాలీ (పిక్చర్స్)

హైదరాబాద్: సిడబ్ల్యూసి విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో ఇరవై నాలుగు రోజులుగా ఉద్యమం నడుస్తోంది. మరోవైపు తెలంగాణలో పార్లమెంటులో ఈ సమావేశాలలోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో శాంతి దీక్షలు చేస్తున్నారు.

సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం భారీగా ర్యాలీలు, దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. రోజుకో ప్రాంతంలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లాలో లక్ష గళ ఘోష సభ జరగగా, శుక్రవారం నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో సభ జరిగింది.

ఈ సభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి మాట్లాడారు. హైదరాబాదు పైన సీమాంధ్ర ప్రజలకు కూడా హక్కుందన్నారు. సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దీక్షను గురువారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. విశాఖలో టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు ఆరోగ్యం క్షీణిస్తోంది. మరోవైపు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు టిడిపి నేత హరికృష్ణ దారిలో రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాదుకు పాస్‌పోర్ట్...!

హైదరాబాదుకు పాస్‌పోర్ట్...!

సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. అనంతపురంలో హైదరాబాదుకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.

విశాఖ

విశాఖ

రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైజాగ్‌లో ఓ సమైక్యవాది వినూత్నంగా నిరసన తెలుపుతున్న దృశ్యం. ఒకే భాష.. ఒకే రాష్ట్రం అంటూ రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించారు.

భోజనం

భోజనం

సమైక్యాంధ్రకు మద్దతుగా వైజాగ్‌లో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆందోళనలో పాల్గొని రోడ్డు పైనే భోజనాలు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయం

తెలుగుదేశం పార్టీ కార్యాలయం

వైజాగ్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కార్యాలయంలోనే తమను తాము బంధించుకోని దీక్ష చేస్తున్నారు.

రక్త దానం

రక్త దానం

సమైక్యాంధ్రను కోరుతూ పలువురు సమైక్యవాదులు రక్తదానం చేసి నిరసన తెలిపారు. హైదరాబాదులో పలువురు సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్రను కోరుతూ రక్తదానం చేశారు.

 ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం

ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం

రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందామంటూ... తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణవాదులు

షోయబుల్లా ఖాన్

షోయబుల్లా ఖాన్

షోయబుల్లా ఖాన్ డెత్ ఆనువర్సరీ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని లింగంపల్లిలో ర్యాలీ తీస్తున్న దృశ్యం

తెలంగాణ

తెలంగాణ

మా తెలంగాణ మాగ్గావాలే.. అంటూ పలువురు తెలంగాణవాదులు జెండా ప్రదర్శిస్తున్న దృశ్యం. పార్లమెంటులో త్వరగా తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో శాంతి దీక్షలు చేస్తున్నారు.

సచివాలయం

సచివాలయం

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు పార్లమెంటులో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశ పెట్టాలని ర్యాలీ చేస్తున్న దృశ్యం. భాష ఒక్కటే... రాష్ట్రాలు మాత్రమే రెండు అని, రాష్ట్రాలుగా విడిపోయి వ్యక్తులుగా కలిసుందామని వారు నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+