కెసిఆర్‌కు ముందే టి కాంగ్ టూర్, సీమాంధ్రులకు భరోసా

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు ఉంటున్నందున ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండబోదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని కాంగ్రెస్ అధిష్ఠానం పదే పదే చెబుతోందని, అయినా ఈ సీమాంధ్ర నేతలు ఇప్పటికీ దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై తగిన సమాధానం చెప్పాల్సి ఉందన్న అభిప్రాయానికొచ్చారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం సాధ్యం కాదని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ స్థిరపడ్డ ఎవరినీ బెదిరించడంగానీ, వెళ్లిపోవాలంటూ అదిలించడం గానీ మంచిది కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించినా దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని భావించారు.
అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించిన కెసిఆర్ తెలంగాణ ప్రాంతంలో పర్యటనలు జరిపితే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన స్థాయిలో పేరు ప్రతిష్ఠలు రావన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాల పర్యటనలకు సిద్ధం కాకముందే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం ఉందని తీర్మానించారు. ఈ నెల 30న నిజామాబాద్ జిల్లాలో పర్యటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. మిగిలిన వారినీ సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications