ఐదు రోజుల పాటు పన్నెండు మంది ఎంపీల సస్పెన్షన్

ఈ రోజు రెండుసార్లు సభ వాయిదా పడిన అనంతరం పన్నెండన్నర గంటలకు తిరిగి ప్రారంభమైంది. సభ మొదలుకాగానే కమల్ నాథ్ సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని నలుగురు టిడిపి, ఎనిమిది మంది కాంగ్రెసు ఎంపీలపై తీర్మానం ప్రవేశ పెట్టారు. స్పీకర్ వారిని ఐదు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సస్పెండైన వారిలో టిడిపి ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్, కొణకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కాంగ్రెసు ఎంపీలు హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివ రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు ఉన్నారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. సభ రేపటికి వాయిదా పడినప్పటికీ టిడిపి ఎంపీలు మాత్రం సభలోనే బైఠాయించారు.
రాజ్యసభలో సుజనా చౌదరి
రాజ్యసభలో టిడిపి ఎంపి సుజనా చౌదరి సీమాంధ్ర ఉద్యమంపై మాట్లాడారు. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతోందని, కొద్ది రోజులుగా బస్సులు నడవటం లేదని, లక్షలాది మంది రోడ్లపైకి వస్తున్నారని చెప్పారు. సీమాంధ్రలోని పరిస్థితులపై కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications