ముంబై గ్యాంగ్ రేప్: ఒకరి అరెస్టు, ఐదుగురి గుర్తింపు
ముంబై: ముంబైలో జరిగిన ఫొటో జర్నలిస్టు గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ముంబై సామూహిక అత్యాచారం కేసును ఛేదించినట్లు పోలీసులు మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఐదుగురు నిందితులను కూడా గుర్తించామి చెప్పారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు.
గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఓ పత్రికలో పనిచేస్తున్న మహిళా ఫొటో జర్నలిస్టుపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. నేరం చేయడానికి ముందు నిందితుడు బాధితురాలి వద్దకు, ఆమె సహోద్యోగి వద్దకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఆర్ఆర్ పాటిల్ రాజీనామాకు శివసేన డిమాండ్
నగరంలో మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ శివసేన మహిళా విభాగం కార్యకర్తలు ఎన్ఎం జోషీ మార్గ్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్‌తో పాటు ముంబై పోలీసు కమిషనర్ రాజీనామా చేయాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. మహిళలు పాటిల్‌కు గాజుల బాక్సులు పంపించాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications