పురంధేశ్వరి, జూ ఎన్టీఆర్: హరికృష్ణపై కెఈ సంచలనం

ఆరేళ్లుగా రాజ్యసభలో ఎన్నడూ మాట్లాడని హరికృష్ణ ఇప్పుడు సమైక్యాంధ్ర కోసమంటూ కథలు చెప్పడం విడ్డూరమన్నారు. ఆయన రాజీనామా ఓ డ్రామాగా అభివర్ణించారు. తన తనయుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకు వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు లేఖ రాయడం రాదని మండిపడ్డారు.
హిందూపురం నుండి యాత్ర చేస్తానని ఓసారి, నిమ్మకూరు నుండి చేస్తానని ఓసారి హరికృష్ణ చెబుతున్నారన్నారు. ఆయన సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో యాత్ర చేస్తే అభ్యంతరం లేదన్నారు. చిత్తశుద్ధితో ఎవరు యాత్ర చేసినా మద్దతిస్తామని, హరి యాత్ర ప్రారంభించాక చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
శాయశక్తులో పోరాడాం: టిడిపి సీమాంధ్ర ఎంపీలు
సీమాంధ్ర ప్రజల మనోభావాల మేరకు తాము పార్లమెంటులో శాయశక్తులా కృషి చేశామని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు రమేష్ రాథోడ్, కొణకళ్ల నారాయణలు వేరుగా అన్నారు. రేపటి నుండి తాము పార్లమెంటు ఆవరణలో దీక్ష చేస్తామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే విభజన రాజకీయాలకు తెరతీశారన్నారు. సస్పెన్షన్‌ను తొలగించాలని కోరినా వినలేదన్నారు.
జైలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టడం కాదని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సభలో ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు ఎందుకు సీమాంధ్ర ప్రజల గొంతు వినిపించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కలుపుకుందామనే కాంగ్రెసు విభజన చేస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications