హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిక్చర్స్: సిటీలో పోటాపోటీ ఆందోళనలు, సమైక్య సెగ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు ప్రభుత్వ సంస్థల్లో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం కూడా పోటాపోటీ ఆందోళనలకు దిగారు. విద్యుత్ సౌధ ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది. నిజాం కళాశాలలో తెలంగాణ విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్ సౌధా వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావును, నిజాం కళాశాల వద్ద మరో తెరాస శాసనసభ్యుడు ఈటెల రాజేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సచివాలయంలో ఆందోళనలపై సోమవారం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రతి రోజూ సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటా పోటీగా ఉద్యమ నినాదాలు చేస్తుండడంతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ కార్యాకలాపాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీంతో సచివాలయం ప్రాంగణంలో ఎవరూ మైకులు, డప్పులు, నృత్యాలు చేస్తూ ఆందోళనలు చేయరాదని ప్రభుత్వ కార్యదర్శి (సీఎస్) ఆదేశించారు. శాంతియుతంగా నిరసన చేస్తే అభ్యంతరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

విద్యుత్‌సౌధ వద్ద సోమవారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆదివారం జరిగిన ఆందోళనలో తెలంగాణ ఉద్యోగి సంతోష్‌పై ఆంధ్రా ఉద్యోగి దాడి చేశారని, అతనిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని హరీష్‌రావు మండిపడ్డారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా అటవీశాఖ కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. హమారా హైదరాబాద్ పేరిట నగరంలోని నిజాం కాలేజీ నుంచి టీఆర్ఎస్వీ సోమవారం ఉదయం శాంతి ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకై వచ్చిన టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉస్మానియాలో మళ్లీ...

ఉస్మానియాలో మళ్లీ...

హైదరాబాదులో తెలంగాణ సంఘాలు సద్భావనా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం శాంతి ర్యాలీ జరిగింది. ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులు ఇలా...

ఉస్మానియాలో శాంతి ర్యాలీ...

ఉస్మానియాలో శాంతి ర్యాలీ...

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని సీమాంధ్రులకు విజ్ఝప్తి చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు.

సచివాలయంలో సీమాంధ్ర ఆందోళన

సచివాలయంలో సీమాంధ్ర ఆందోళన

ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కాంగ్రెసు వార్ రూంలో లుకలుకలంటూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారు.

సోనియా మానియా

సోనియా మానియా

సోనియా మానియా క్విట్ అంటూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

వదిలేది లేదంటూ నినాదాలు..

వదిలేది లేదంటూ నినాదాలు..

హైదరాబాదును వదిలిపెట్టి లేదంటూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నినాదాలు చేశారు. తమకు హైదరాబాదుపై హక్కు ఉందని వారంటున్నారు.

చెయ్యెత్తి జైకొట్టి...

చెయ్యెత్తి జైకొట్టి...

చెయ్యెత్తి జైకొట్టి సీమాంధ్ర ఉద్యోగులు సమైక్య నినాదాలు చేస్తున్నారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన సోమవారం కూడా జరిగింది.

 విద్యుత్ సౌధ వద్ద హరీష్ రావు..

విద్యుత్ సౌధ వద్ద హరీష్ రావు..

విద్యుత్ సౌధ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలకు దిగారు. ఈ సందర్భంగా హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ ఆయన విమర్సించారు.

నల్లజెండాలతో తెలంగాణ ఉద్యోగులు

నల్లజెండాలతో తెలంగాణ ఉద్యోగులు

విద్యుత్ సౌధా వద్ద తెలంగాణ ఉద్యోగులు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. తమ ప్రాంత ఉద్యోగిని సీమాంధ్ర ఉద్యోగులు అవమానించారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జెఎసి నాయకుడు రఘు ఆరోపించారు.

విద్యుత్ సౌధా ఉద్రిక్తం..

విద్యుత్ సౌధా ఉద్రిక్తం..

విద్యుత్ సౌధా వద్ద పోటాపోటీ ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యుత్ సౌధా వద్ద నిరసన

విద్యుత్ సౌధా వద్ద నిరసన

ఆందోళనకారులు విద్యుత్ సౌధా వద్ద నిరసనకారులు బైఠాయించారు. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల ఆదోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నిజాం కళాశాల వద్ద నినాదాలు...

నిజాం కళాశాల వద్ద నినాదాలు...

హైదరాబాదులోని నిజాం కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థులు శాంతి ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విద్యార్థి సంఘం నాయకుడు ఇలా నినాదాలు చేస్తూ...

విద్యార్థుల అరెస్టు..

విద్యార్థుల అరెస్టు..

నిజాం కళాశాల వద్ద శాంతి ర్యాలీ నిర్వహించిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా విద్యార్థులను అరెస్టు చేస్తూ పోలీసులు..

బలగాల మోహరింపు...

బలగాల మోహరింపు...

తెరాస విద్యార్థి సంఘం తలపెట్టిన శాంతి ర్యాలీ సందర్భంగా సోమవారం నిజాం కళాశాల వద్ద మోహరించిన బలగాలు... శాంతి ర్యాలీని అడ్డుకున్నారు.

ఎమ్మెల్సీ స్వామి గౌడ్..

ఎమ్మెల్సీ స్వామి గౌడ్..

తెరాస విద్యార్థి సంఘం తలపెట్టిన శాంతిర్యాలీకి వచ్చిన ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఇలా... ఆయనను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.

రాజేందర్ అరెస్టు..

రాజేందర్ అరెస్టు..

తెరాస విద్యార్థి సంఘం తలపెట్టిన శాంతి ర్యాలీకి వచ్చిన ఆ పార్టీ శానససభ్యుడు ఈటెల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతిలో నిరసన

తిరుపతిలో నిరసన

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతిలో సోమవారం కూడా ఆందోళనలు జరిగాయి. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న ఆందోళనకారులు.

వినూత్న నిరసన..

వినూత్న నిరసన..


తిరుపతిలో ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వీరు సమైక్యాంధ్రను కోరుతూ ఇలా ఆందోళనకు దిగారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MLAs Harish Rao and Etela Rajender have been arrested in different places in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X