వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

.. తెలిసీ జగన్ దీక్ష: శోభా, జైలు మార్చాలని టి లాయర్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy
హైదరాబాద్: తనకు సౌకర్యాలు పోతాయని తెలిసీ తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం జైలులోనే దీక్ష చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శోభా నాగి రెడ్డి, గొల్ల బాబురావు, నేత ప్రవీణ్ కుమార్‌లు అన్నారు. వారు సోమవారం జైళ్ల శాఖ డిజిని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ములాఖత్‌లు, ఇతర సౌకర్యాలు పోతాయని తెలిసినా జగన్ దీక్షకు పూనుకున్నారన్నారు. రోజూ సాయంత్రం ఆరు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని, ఆయన ఆరోగ్యం బాగనే ఉందని అధికారులు చెప్పారన్నారు. జగన్‌ను చంచల్ గూడ జైలు నుండి ఇతర ప్రాంతాల జైలుకు తరలించే కుట్రలను చేస్తున్నారని వారు ఆరోపించారు.

వైయస్ బీజం వేశారని విష ప్రచారం: కొణతాల

విభజనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డే బీజం వేశారని విష ప్రచారం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం లేని వ్యక్తి పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు నేతలు పదవులకు రాజీనామా చేయాలన్నారు. సమ న్యాయం చేయకుంటే విభజన ఆపమనేదే తమ డిమాండ్ అన్నారు.

విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలోని పరిస్థితిని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లేందుకు తాము మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలన్నారు. కాంగ్రెసు పార్టీ వైయస్‌ను గౌరవించి ఉంటే రెండో ఎస్సార్సీ వేసేదన్నారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హౌదా కల్పించాలన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తే తెలంగాణలో తెరాసకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు.

వేరే జైలుకు తరలించాలని టి లాయర్లు

చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేరే జైలుకు తరలించాలని తెలంగాణ న్యాయవాదులు జైలు అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం. వారి వినతి పత్రాన్ని జైళ్ల శాఖ డిజి స్వీకరించారు.

English summary
YSR Congress Party MLAs Sobha Nagi Reddy, Babu Rao said on Monday that party chief YS Jaganmohan Reddy is continuing deeksha in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X