ధర్మానకు సుప్రీం నోటీసులు, జగన్ రిమాండ్ పొడిగింపు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ధర్మాన అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ధర్మానను విచారించేందుకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అనంతపురంలోని లేపాక్షి నాలెడ్జ్ భూముల వ్యవహారంలో ధర్మాన ప్రసాద రావును సిబిఐ అధికారులు ఈ నెల 21వ తేదిన ఐదు గంటల పాటు కోఠిలోని సిబిఐ కార్యాలయంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే.
జగన్ రిమాండ్ పొడిగింపు
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్ జగన్ రిమాండును సిబిఐ కోర్టు సెప్టెంబర్ 6 వరకు పొడిగించింది. జగన్‌ను న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసుల నిందితుల రిమాండును కూడా కోర్టు సెప్టెంబర్ 6 వరకు పొడిగించింది.
చీఫ్ ఇంజనీర్‌ను పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు
రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ శివా రెడ్డిని పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పుట్టిన తేది వివాదంపై ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనపై చర్య తీసుకుంది. శివా రెడ్డి పుట్టిన తేదిపై వివాదం, వ్యతిరేకత ఉన్నా పట్టించుకోకుండా ఆయనను పదవిలో నియమించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications