వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శైలజానాథ్‌కు చేదు అనుభవం, ప్రధానితో జగన్ పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sailajanath
అనంతపురం/ఢిల్లీ: మంత్రి శైలజానాథ్‌కు మంగళవారం అనంతపురం జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. అనంతపురంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు శైలజానాథ్ అక్కడకు వచ్చారు. అయితే, ఉద్యోగులు ఆయనను అడ్డుకున్నారు. గోబ్యాక్ శైలజానాథ్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసే వరకు తాము రానిచ్చే ప్రసక్తి లేదని చెప్పారు.

భద్రాచలం తెలంగాణదే: విక్రమార్క

భద్రాచలం తెలంగాణదేనని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో అన్నారు. తెలంగాణతో భద్రాచలంకు విడదీయరాని బంధముందన్నారు. దీనిని ఆంధ్రలో కలపాలనడం సరికాదని ఆయన అన్నారు.

విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి: అశోక్ బాబు

విభజనపై కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందేనని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు న్యూఢిల్లీలో అన్నారు. సీమాంధ్ర సమస్యలను జాతీయ నేతల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని, రాష్ట్రం అంధకారమవుతుందని హెచ్చరించారు. హైదరాబాదులో సభలు పెట్టుకోవడం అప్రజాస్వామికం కాదన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఆంటోని కమిటీని కలవాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.

ప్రధానిని కలిసిన వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను మంగళవారం మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, సీనియర్ నేత మైసూరా రెడ్డిలు మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అన్నారు.

English summary

 Minister Sailajanath face bitter experience in Anantapur district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X