వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలకు సమయమా?, రెచ్చగొడ్తున్నారు: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పార్టీలు ప్రజలను మరింత రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ప్రజలు 27 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం దానిపై స్పందించడం లేదని ఆరోపించారు. అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రగిలి పరిస్థితులు సున్నితంగా మారిన తరుణంలో రాజకీయం సరికాదన్నారు.

సోమవారం బాబు ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా సచివాలయం, విద్యుత్ సౌధ, జల సౌధ, ఇతర కార్యాలయాల్లో సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు తమకు తోచిన విధంగా శాంతియుత ఉద్యమాలు చేసుకోవచ్చునని సూచించారు.

అలాంటప్పుడు ఇతరులు వారి కార్యక్రమాలను అడ్డుకోవడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం, రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించడం మంచిది కాదన్నారు. ఇరవై ఏడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనచేస్తున్నా వారిని శాంతింపజేసే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవడం గర్హనీయమన్నారు.

తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండన్న రీతిలో కాంగ్రెస్ నేతలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సున్నితమైన తెలంగాణ అంశాన్ని సమగ్ర రీతిలో పరిష్కరించాల్సిన కాంగ్రెస్, రాజకీయ ప్రయోజనాల కోసం జఠిలం చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టిందన్నారు.

English summary

 Telugudesam Party cheif Nara Chandrababu Naidu criticised the Congress led UPA government at the Centre and the state government for failing to assuage the feelings of Seemandhra people who are agitating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X