టి: వైయస్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్న ప్రధాని!

Manmohan Singh and Ys Vijayamma
న్యూఢిల్లీ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తమతో అన్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, సీనియర్ నేత మైసూరా రెడ్డి మంగళవారం అన్నారు. వారు మధ్యాహ్నం ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

వైయస్ బతికుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఆయననే అన్ని చూసుకునే వారని ప్రధాని తమతో చెప్పారన్నారు. విభజన నేపథ్యంలో మంత్రుల బృందంతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు. తెలంగాణపై సిడబ్ల్యూసిది ఏకపక్ష నిర్ణయమని తాము ఆయనకు చెప్పామన్నారు.

విభజనతో సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరామన్నారు. మంత్రుల కమిటీ రాష్ట్రంలోని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను తాము ఆయన దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ప్రధానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వినతి పత్రం అందించింది.

సమన్యాయం చేయాలని లేనిపక్షంలో విభజనను నిలిపివేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ వినతి పత్రంలో పేర్కొంది. సిడబ్ల్యూసి నిర్ణయం ఏకపక్షమని, 57 ఏళ్లుగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని విభజిస్తారా అని ప్రశ్నించారు. 2001లో ఎస్సార్సీ అన్న కాంగ్రెసు ఇప్పుడు విభజన చేసిందన్నారు. విభజన ద్వారా వచ్చే నీరు, హైదరాబాద్ సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నారు. విభజన తీరు నిరసిస్తూ తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+